Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:34 AM

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత
12-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు లో కొలువైన అత్యంత పురాతనమైన శివాలయానికి శివపార్వతులు మరియు వినాయకుల ఇత్తడి విగ్రహాలను దాతలు అందజేసినట్లు ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు తెలిపారు. శివపార్వతుల విగ్రహాలను కోటపాడు కు చెందిన డొంకిన సత్యనారాయణ లీల రాధ దంపతులు, వినాయకుని విగ్రహాన్ని సత్తుపల్లి కి చెందిన పాటిబండ్ల కమలాకర్ రావు సౌజన్య దంపతులు అందజేశారని తెలిపారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతన విగ్రహాలకు శుక్రవారం దాన్యాభిషేకం, శనివారం జలాభిషేకం నిర్వహిస్తారని, ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు సుబ్రహ్మణ్యంశాస్త్రి, పేటేటి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని భాస్కర్ రావు తెలిపారు.

Sthanikam

కోటపాడు శివాలయానికి నూతన ఇత్తడి విగ్రహాలు అందజేత

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు లో కొలువైన అత్యంత పురాతనమైన శివాలయానికి శివపార్వతులు మరియు వినాయకుల ఇత్తడి విగ్రహాలను దాతలు అందజేసినట్లు ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కరరావు తెలిపారు. శివపార్వతుల విగ్రహాలను కోటపాడు కు చెందిన డొంకిన సత్యనారాయణ లీల రాధ దంపతులు, వినాయకుని విగ్రహాన్ని సత్తుపల్లి కి చెందిన పాటిబండ్ల కమలాకర్ రావు సౌజన్య దంపతులు అందజేశారని తెలిపారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నూతన విగ్రహాలకు శుక్రవారం దాన్యాభిషేకం, శనివారం జలాభిషేకం నిర్వహిస్తారని, ఆదివారం రాత్రి శివపార్వతుల కళ్యాణాన్ని వేద పండితులు సుబ్రహ్మణ్యంశాస్త్రి, పేటేటి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని భాస్కర్ రావు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News