Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:38 PM

కొమరయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలి – మంత్రి పిలుపు

03-04-2026 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరవీరుడు దొడ్డి కొమరయ్య పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రైతుల హక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాటస్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.మంత్రి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమరయ్య చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలను సాకారం చేయడం ద్వారానే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజాసేవలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ ఉద్యమానికి నాంది పలికిన గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. రైతాంగ గళంగా నిలిచిన ఆయన జీవితం యువతకు ప్రేరణనిచ్చేదిగా ఉందని చెప్పారు. సమాజంలో సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం విలువలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్‌లు కూన వనిత, సుమలత శ్రీకాంత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీశ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం మల్లయ్య, జనరల్ సెక్రటరీ తాటిపల్లి పాండు, బీసీ సంఘం యువ అధ్యక్షుడు రమేష్ కుమార్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొమరయ్య స్ఫూర్తితో ముందుకు సాగాలి – మంత్రి పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News