Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

కోదండ రామాలయంలో కళ్యాణ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

Updated : 24 Mar 2026 16:32 IST
As Preferred Source 1 min read
కోదండ రామాలయంలో కళ్యాణ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్, ఆలయ ధర్మకర్తలు.....

కోదాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవాలయ కళ్యాణ మండపం ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకల సందడి మొదలైంది. వచ్చే శుక్రవారం మార్చి 27 ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి,మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ ధర్మకర్తలు నాగుబండి రంగా, రంగనాథ్ లు మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ కళ్యాణ మండప ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా మండప ప్రాంగణంలో జీవనోపాధి కొరకు చిరు వ్యాపారాలు నడుపుకుంటున్న వారు కూడా స్వామి వారి కల్యాణ మహోత్సవనికి సహకరించి భాగస్వామ్యులం అవుతామని ఉత్సాహంగా ముందుకు వచ్చారు........

Sthanikam

కోదండ రామాలయంలో కళ్యాణ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి