Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు

21-03-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో నీటి కొరత తీవ్రంగా మారింది. ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పాటు బోర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక రైతు బుంగ బిక్షం మాట్లాడుతూ, సాగునీరు అందక పంటలు నష్టపోతున్నాయని, పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక బిక్కేరు వాగులో జరుగుతున్న అధిక ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోయి, నీటి ఊటలు క్షీణించాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సాగునీరు మాత్రమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారుతోందని తెలిపారు.

అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడంతో పాటు, సాగు మరియు తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.

Sthanikam

కొండగడపలో నీటి సంక్షోభం – ఎండిపోతున్న వరి పంటలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News