Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

కోదాడలో భాజపా జెండా ఎగరడం ఖాయం: ఎన్. రామచందర్ రావు...

08-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడలో భాజపా జెండా ఎగరడం ఖాయం: ఎన్. రామచందర్ రావు...

వంచన చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలి: రామచందర్ రావు పిలుపు....

కోదాడ తెలంగాణను దోచుకుంటున్న బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి అని బిజెపి నేత ఎన్. రామచందర్ రావు అన్నారు. కోదాడ పట్టణంలో మున్సీపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, రంగా థియేటర్ చౌరస్తా వద్ద కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పాల్పడుతోందని, మరోవైపు బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో పాలించిన బీఆర్ఎస్ రెండు కూడా అవినీతి పార్టీ లేనాని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అంతటా అభివృద్ధి పరుగులు తీస్తోందని, కానీ రాష్ట్ర పాలకులు కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. కోదాడను అమృత్ పథకం కింద అభివృద్ధి చేసి, ప్రతి ఇంటికీ మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న పాలకులకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. యువత మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజలను వంచిస్తున్న పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి అని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో కుటుంబ పాలన, అవినీతి రాజ్యమేలుతోందని కాంగ్రెస్ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోదాడ అభివృద్ధి కేవలం ఎన్నికల హామీలకే పరిమితమైంది. మురుగునీటి సమస్యలు, అధ్వాన్నపు రోడ్లతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ దుస్థితి మారాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని వ్యాఖ్యానించారు.కమలం గుర్తుకు ఓటు వేసి భాజపా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, జుట్టు కొండా సత్యనారాయణ,కొప్పుల నరసింహారెడ్డి, మురళీధర్ రెడ్డి, వంగవీటి శ్రీనివాస్,బండారు కవిత రెడ్డి, అంజి యాదవ్, బొలిశెట్టి కృష్ణయ్య, కనగాల వెంకటరామయ్య,నూనె సులోచన, యదా రమేష్, యశ్వంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..........

Sthanikam

కోదాడలో భాజపా జెండా ఎగరడం ఖాయం: ఎన్. రామచందర్ రావు...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News