Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సిపిఎం పార్టీ పోరాట ఫలితమే నేడు రైతులకు భూమి పట్టాలు ;మల్లు నాగార్జున రెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:08 PM

కోదాడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

కోదాడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

కోదాడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం
16-02-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

చైర్‌పర్సన్‌గా ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్‌గా దేవరపల్లి మల్లీశ్వరి

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పర్యవేక్షణలో ఏకగ్రీవ ఎన్నిక

కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ న్నికల పర్వం సోమవారం లాంఛనంగా ముగిసింది. అంచనాల ప్రకారమే కోదాడ పురపాలక పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హైదరాబాద్ శిబిరం నుంచి కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్వయంగా బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. 35 మంది కౌన్సిలర్లు ఉన్న మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ పదవికి ఎర్నేని కుసుమ పేరును కందుల కోటేశ్వరరావు ప్రతిపాదించగా, షఫీ బలపరిచారు. వైస్ చైర్మన్ పదవికి దేవరపల్లి మల్లీశ్వరి పేరును కొల్లా కోటిరెడ్డి ప్రతిపాదించగా, షాబుద్దీన్ బలపరిచారు. ఇతర అభ్యర్థులు ఎవరూ పోటీలో లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవిలు ప్రకటించి, ప్రమాణ స్వీకారం చేయించారు.

పట్టణ అభివృద్ధికి పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల నాయకత్వంలో కోదాడను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం అని నూతన చైర్‌పర్సన్ ధీమా వ్యక్తం చేశారు.ఎన్నికల అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసుకొని బాణాసంచా కాల్చి సంబరాలు ఘనంగా నిర్వహించారు......

Sthanikam

కోదాడ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News