Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:00 AM

కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు మరువలేనివి

23-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ట మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు మిట్టకోల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు మిట్టకొల సతీష్ కుమార్ ,పద్మశాలి ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం చంద్రశేఖర్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు కడారి బిక్షం, మున్సిపల్ కౌన్సిలర్ గండూరి రమేష్ , ఫార్మసిటికల్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ముశం హరి ప్రసాద్ లు మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు మరువలేనివని అన్నారు. 1969 లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని వెల్లడించారు. స్వాతంత్రం పోరాటం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమ వరకు ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం పురుడుపోసుకుందని అన్నారు. నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమ నాయకులలో బాపూజీ మొదటి వ్యక్తి అని తెలిపారు. దేశంలోనే సహకార సంఘాలు రూపకల్పన చేసింది బాపూజీ అని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు, చేనేత సహకార సంఘాల కోసం ఆయన కృషి మరువలేనిదని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టించడం చాలా గొప్ప విషయమని అన్నారు. విగ్రహ ప్రతిష్టకు కొన్ని వడిదడుగులు వచ్చినా కూడా వాటిని అధిగమించి అందరి సహకారంతో విగ్రహాన్ని ప్రతిష్టించుకోగలిగామని అన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి, వర్ధంతి తోపాటు వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవాలని తెలిపారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం కోశాధికారి బాల్ని మల్లయ్య, కోట వీరయ్య, వరకాల శ్రీనివాస్, కేతం రమేష్ ,మిట్టకోల రామన్న ,దేవరశెట్టి ప్రభాకర్, తాటి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు మరువలేనివి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News