Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:01 AM

కో-ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

04-05-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో నిర్వహించిన మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి నాలుగు కో-ఆప్షన్ సభ్యుల స్థానాలను కైవసం చేసుకుంది. మున్సిపల్ కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో మైనారిటీ BC-E నుంచి మొహమ్మద్ అబ్దుల్ కయుం (ముంతాజ్ సెట్), అర్ఫిన్ సుల్తాన్ మహమ్మద్ అబ్దుల్ మోహిజ్, కురుమ BC-B నుంచి నర్సు గోండ, వీరశైవ లింగాయత్ BC-D నుంచి శెట్టి రేష్మ శెట్టి శంకర్ ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా హాజరైన నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్సిపల్ అభివృద్ధిలో తమ సలహాలు, సూచనలు కీలకంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి, మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్, వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కో-ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News