Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

కంప్యూటర్ నైపుణ్యంతో గ్లోబల్ అవకాశాలు విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం

26-03-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జునసాగర్: కంప్యూటర్ రంగంలో నైపుణ్యం సాధిస్తే ప్రపంచ స్థాయి ఉద్యోగాలను సులభంగా పొందవచ్చని నాగార్జున సాగర్ బీసీ గురుకుల డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బొబ్బిలి రాజా పేర్కొన్నారు.

గురువారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో “కంప్యూటర్ సైన్స్ రంగంలో ఉద్యోగ అన్వేషణ మరియు అభివృద్ధి చెందుతున్న అవకాశాలు” అనే అంశంపై విస్తృత ఉపన్యాసం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. బొబ్బిలి రాజా మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్‌లో నైపుణ్యం కలిగిన వారికి ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషన్ లెర్నింగ్ (ML), సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో విస్తృతంగా ఉద్యోగాలు లభిస్తున్నాయని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.

అదేవిధంగా ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు తగిన మార్గదర్శకత్వం అందించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాలు ఉపేందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించడం, కెరీర్ ఎంపికలో స్పష్టత కల్పించడం లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విభాగాధిపతి వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. రవికుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, సి.ఓ.ఈ డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

కంప్యూటర్ నైపుణ్యంతో గ్లోబల్ అవకాశాలు విద్యార్థులకు నిపుణుల మార్గదర్శనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News