Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోతే విద్య అసంపూర్ణమే: ప్రిన్సిపల్ రాహత్ ఖానం

25-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం, టీఎస్‌కేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉమెన్ అండ్ ఏఐ’ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ సైన్స్‌కు విశేష ప్రాధాన్యత ఉందన్నారు. ఉపాధి అవకాశాల సాధనలో కంప్యూటర్ నైపుణ్యాలు కీలకమని, కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారు ఎంత విద్యావంతులైనా వెనుకబడినట్లే అవుతారని పేర్కొన్నారు.

కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి. అమర్ మాట్లాడుతూ వారం రోజుల శిక్షణలో ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, డేటా అనలిటిక్స్, పవర్ బీఐ, పైథాన్ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, శిక్షకులు జి. సంజీవులు, అధ్యాపకులు డాక్టర్ జి. సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్. వెంకట్ గౌడ్, ఎం. అనిత, డాక్టర్ డి. కిషన్, డాక్టర్ ఎం. రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, నరేష్, రాధిక, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

కంప్యూటర్ నైపుణ్యాలు లేకపోతే విద్య అసంపూర్ణమే: ప్రిన్సిపల్ రాహత్ ఖానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News