Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

ఖేడ్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరవేయడానికి బిఆర్ఎస్ సిద్ధం:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే,మాజీ జడ్పీ చైర్మన్

10-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ప్రచారంలో భాగంగా 11వ, 14వ వార్డులలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,మాజీ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.ప్రచార సమయంలో ప్రజలతో నేరుగా మాట్లాడి బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నారాయణఖేడ్ పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.బిఆర్ఎస్ పార్టీ మాటలకే కాదు, పనులకు కట్టుబడి పనిచేసిన పార్టీ అని ప్రజలకు వివరించారు.11వ వార్డు అభ్యర్థిగా – వర్ష నగేష్ (కారు గుర్తు),14వ వార్డు అభ్యర్థిగా – అమ్రిన్ ముజామిల్ (కారు గుర్తు)వారికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ –

తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నారాయణఖేడ్ పట్టణంలో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసి రవాణా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేశామని చెప్పారు. అభివృద్ధి అనేది కేవలం హామీల్లో కాకుండా పనుల్లో కనిపించాలన్నదే బిఆర్ఎస్ విధానమని స్పష్టం చేశారు.అలాగే నారాయణఖేడ్ పట్టణానికి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేసి కోవిడ్ వంటి కష్టకాలంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుండి పనిచేసిందని గుర్తు చేశారు.మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని, డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతామని తెలిపారు.ప్రజల ఆశీర్వాదంతో మరోసారి నారాయణఖేడ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని చెప్పారు.ప్రజలంతా అభివృద్ధిని చూసి, గత పనులను గుర్తు పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Sthanikam

ఖేడ్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరవేయడానికి బిఆర్ఎస్ సిద్ధం:ఖేఢ్ మాజీ ఎమ్మెల్యే,మాజీ జడ్పీ చైర్మన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News