Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 09:58 PM

కేసీఆర్ పాలనే తెలంగాణాకు శ్రీరామరక్ష

కేసీఆర్ పాలనే తెలంగాణాకు శ్రీరామరక్ష

కేసీఆర్ పాలనే తెలంగాణాకు శ్రీరామరక్ష
18-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

9వ వార్డులో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా 9వ వార్డులో ఘనంగా వేడుకలు నిర్వహించారు.మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు, వార్డు అధ్యక్షుడు గుండగాని నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలోని 9వ వార్డు ప్రజలు, నాయకులు కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో పెరుమాళ్ళ అన్నపూర్ణ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.రైతులకు, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అదోగతి పాలైందని విమర్శించారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.తెలంగాణ ప్రజల గుండెచప్పుడు కేసీఆర్ అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు గుండగాని నాగభూషణం, జానకమ్మ, కుమారులు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

కేసీఆర్ పాలనే తెలంగాణాకు శ్రీరామరక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News