Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్

28-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం పేర్కొంది. శనివారం సోమందేపల్లిలోని పాఠశాల ప్రాంగణంలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు రూపొందించిన సుమారు 520 రకాల మోడల్ ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, ఇతర పాఠశాలల విద్యార్థులు, మీడియా ప్రతినిధులకు తమ ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులు స్వయంగా సమగ్రంగా వివరించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ ప్రసాద్ మరియు ఎండీ అనిల్ కుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విద్యార్థులకు భారతదేశ చరిత్ర, విజ్ఞాన శాస్త్రంపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పవచ్చన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు, వారి ఆసక్తులు, ప్రతిభలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఇలాంటి సైన్స్ ఫెయిర్‌ల ద్వారా విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రజలకు వివరించడం వల్ల వారిలోని భయం, టెన్షన్ తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం హరినాథ్, సైన్స్ ఉపాధ్యాయులు రఘునాథ్, వినోద్ కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Sthanikam

క్రీస్తుజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News