Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:57 PM

క్రీడలతోనే పిల్లల్లో పరిపూర్ణ అభివృద్ధి

క్రీడలతోనే పిల్లల్లో పరిపూర్ణ అభివృద్ధి

క్రీడలతోనే పిల్లల్లో పరిపూర్ణ అభివృద్ధి
28-05-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముగిసిన నెల రోజుల వేసవి శిక్షణ శిబిరం

విద్యార్థులకు ధ్రువపత్రాల అందజేత

డాక్టర్ ముష్కు మధుసూదన్ రెడ్డి వ్యాయామ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ

క్రీడల్లో పాల్గొనడం వల్ల పిల్లల్లో శారీరిక, మానసిక సామర్థ్యాలు పెంపొంది పరిపూర్ణ అభివృద్ధి చెందుతారని కళాశాల అడ్వైజర్ పి. సత్యనారాయణ రాజు అన్నారు. స్థానిక డాక్టర్ ముష్కు మధుసూదన్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో గత నెల ఏప్రిల్ 28 నుండి నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం గురువారంతో ముగిసింది. కళాశాల వైస్ చైర్మన్ పి.సి. శ్రీనివాస్ రెడ్డి విశిష్ట అతిథిగా, ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కుమార్ సాహు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.​నెల రోజుల పాటు జరిగిన ఈ శిబిరంలో విద్యార్థులకు స్కేటింగ్, క్రికెట్, ఫుట్బాల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ వంటి వివిధ క్రీడా విభాగాల్లో నిపుణులైన శిక్షకులతో తర్ఫీదు ఇచ్చారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వేసవి శిక్షణ ధ్రువపత్రాలను (సర్టిపికెట్లను) అందజేశారు. నేటి కాలంలో చదువుతో పాటు శారీరిక దృఢత్వం కూడా ఎంతో అవసరమని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటల వైపు ప్రోత్సహించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ శిబిరాన్ని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సద్వినియోగం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.​ఈ ముగింపు కార్యక్రమంలో కళాశాల వ్యాయామ అధ్యాపకులు జడ ప్రసాదరావు, విజయరాణి, వంశీ, సహాయక శిక్షకులు, శిక్షణలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడలతోనే పిల్లల్లో పరిపూర్ణ అభివృద్ధి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News