Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:08 AM

క్రీడలతో యువతలో క్రమశిక్షణ పెరుగుతుంది: సీఐ వెంకటేశం

06-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వెల్నెస్ హాస్పిటల్ డైరెక్టర్లు వెంకటేష్, లలేష్ ఆధ్వర్యంలో సదాశివపేట మండలం అరూర్ గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 14న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 64 జట్లు పాల్గొనగా, 22 రోజుల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరించాయి. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అరూర్ మరియు ఏర్దానూర్ జట్లు తలపడగా, విజేత జట్టుకు రూ.50 వేల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి మరియు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకటేశం విజేతలు, రన్నరప్ జట్లకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడిన వారు మరింత కృషి చేసి ముందుకు సాగాలని, గెలిచిన వారు ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. నేటి యువత జీవితంలో లక్ష్యంతో ముందుకు సాగాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి తల్లిదండ్రులు చూపే మంచి మార్గంలో నడవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పాటించాలని, క్రీడలు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. మంచి స్నేహితులను ఎంచుకుని చెడు అలవాట్లు, చెడు స్నేహితులకు దూరంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు అధికంగా అలవాటు పడకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్ గౌతమ్, ఆసుపత్రి సిబ్బంది, గ్రామ ప్రముఖులు, క్రీడాభిమానులు, యువకులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడలతో యువతలో క్రమశిక్షణ పెరుగుతుంది: సీఐ వెంకటేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News