Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:47 PM

కరవు భత్యం బకాయిలు వెంటనే చెల్లించాలి – దొంత నరేందర్ డిమాండ్

24-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అల్లాదుర్గం విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అతిథి గృహంలో జిల్లా నాయకుల సమక్షంలో వార్షిక పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లాదుర్గం, శంకరంపేట్, రేగోడు మండలాలకు చెందిన సంఘ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉద్యోగుల హక్కుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యం బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా తాత్కాలిక చర్యలు చేపట్టడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మెదక్ జిల్లాను భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా రాజన్న సిరిసిల్ల పరిధిలో చేర్చడం వల్ల నిరుద్యోగులతో పాటు ఉద్యోగులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మెదక్ జిల్లాను చార్మినార్ పరిధిలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం మండల స్థాయిలో సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.జిల్లా కార్యదర్శి మినికె రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే హక్కుల పరిరక్షణ ముఖ్యమన్నారు. ఉద్యోగి హక్కులు కాపాడబడితేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలడని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తే సంఘం తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు.జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు రూ. ఒక కోటి ఇరవై లక్షల ప్రమాద బీమా కల్పించడం అభినందనీయమన్నారు. అలాగే ప్రభుత్వం–ఉద్యోగులు కలిసి నిధులు సమీకరించి అత్యాధునిక ప్రైవేటు వైద్యం అందించేందుకు ఆరోగ్య పత్రాలు జారీ చేయడం మంచి నిర్ణయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అవసరమైన నిధులను తప్పనిసరిగా విడుదల చేసే విధంగా స్పష్టమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ వేదిక అధ్యక్షుడు గోపాల్, పంచాయతీ కార్యదర్శుల వేదిక అధ్యక్షుడు సంతోష్, అల్లాదుర్గం విభాగ అధ్యక్షుడు ధర్మచందర్, ఖజాంచి వినీత్, ఉపాధ్యక్షులు లింగప్ప, చంద్రకాంత్, సంయుక్త కార్యదర్శి సునీల్, సభ్యులు మహేందర్ రెడ్డి, అంజయ్య, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కరవు భత్యం బకాయిలు వెంటనే చెల్లించాలి – దొంత నరేందర్ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News