Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:07 PM

కరస్గుత్తిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి

01-06-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్,అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్ది మండలం కరస్గుత్తి గ్రామంలో సోమవారం మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు, మహిళలు, యువతకు అవగాహన కల్పించిన నారాయణఖేడ్ డివిజన్ షీ టీమ్ ఇంచార్జీ ఏఎస్ఐ తులసిరాం మాట్లాడుతూ మహిళల రక్షణకు షీ టీమ్ నిరంతరం కృషి చేస్తోందని, లింగ వివక్ష, పని ప్రదేశాల్లో వేధింపులు, బాలల రక్షణ చట్టాలు, మహిళల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772ను వినియోగించుకోవాలని షీ టీమ్ ఇంచార్జీ ఏఎస్ఐ తులసి రాం సూచించారు.ఈ కార్యక్రమంలో నాగల్గిద్ది పోలీస్ అధికారులు,షీ టీమ్

కానిస్టేబుల్ చాంగుబాయి, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. మహిళల భద్రత, బాలల సంక్షేమం, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

కరస్గుత్తిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News