Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:53 AM

కార్మికుల సంక్షేమం ఎక్కడ?

కార్మికుల సంక్షేమం ఎక్కడ?

కార్మికుల సంక్షేమం ఎక్కడ?
13-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కలెక్టర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా

సూర్యాపేట:

భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ ఎం. సుదర్శన్ రెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కార్మికులకు ఉపయోగపడని హెల్త్ పరీక్షలు నిర్వహిస్తూ వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఈ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ బీమా సంస్థల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసి, నేరుగా వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రయోజనాలు అందించాలని కోరారు. జీవో నెంబర్ 12ను సవరించి కాన్పు, పెళ్లి కానుకకు ప్రస్తుతం ఇస్తున్న 30 వేల రూపాయలను లక్ష రూపాయలకు పెంచాలని, సహజ మరణానికి ఇస్తున్న 2 లక్షలను 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో కార్మిక శాఖ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న సహాయ కార్మిక కమిషనర్, కార్మిక అధికారి, జూనియర్ సహాయక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను తక్షణమే పరిష్కరించాలని, 60 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి నెలకు రూ.5 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.

అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు సలహా కమిటీని వెంటనే నియమించాలని, మిగిలిన నిధులను కార్మికుల సంక్షేమం కోసమే వినియోగించాలని, 2009 నుంచి పునరుద్ధరణ కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం వెంటనే పునరుద్ధరణ కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లకావత్ బాలాజీ నాయక్, కోశాధికారి కొత్తపల్లి శివకృష్ణ, సహాయ కార్యదర్శి కందుల నాగలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ధనావత్ నెహ్రూ, ములకలపల్లి పద్మ, నార్ల రంగయ్య, వంగాల శేఖర్, చిక్కుళ్ల ఉపేందర్, గుంజా రవీందర్, కొమర రాజు, మల్లెపాక సోమయ్య, రూపావత్ ఏడుకొండలు, షేక్ నాగుల్ మీరా, కంచుపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కార్మికుల సంక్షేమం ఎక్కడ?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News