Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్నారుల భద్రతకు ముందడుగు – ప్రత్యేక బాల ఆరోగ్య పరీక్షలకు శ్రీకారం బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 01, 2026 09:53 PM

కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

కార్మికుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా
May 01, 2026 08:26 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని జహీరాబాద్ పట్టణంలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులను గౌరవిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా గారు కార్మికులకు “శ్రమశక్తి ఉత్తమ అవార్డులు” ప్రదానం చేసి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్మికుల శ్రమే తెలంగాణ సంపద సృష్టికి పునాది అని, తమ కష్టంతో సమాజ నిర్మాణం చేసి దేశ పురోగతికి తోడ్పడుతున్న ప్రతి శ్రామికుడికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు దక్కాలని, ప్రతి కార్మికుడు తన హక్కుల పట్ల చైతన్యవంతుడై ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అసంఘటిత రంగ గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల శ్రేయస్సుకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరమేష్ రెడ్డి, శీలవంత్, దిలీప్, అభిషేక్, అజారుద్దీన్, చంద్రశేఖర్ శర్మ, షాహెద్ అలీ, సంగమేష్ స్వామి, చంద్రకళ, జగదీశ్వరి, శ్యామల, అర్చన, యోగేంద్ర శర్మ, ప్రశాంత్, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News