Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:40 AM

కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు అవసరం.జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం

20-03-2026 183 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కార్మిక ఉద్యమ నాయకుడు తిరందాసు గోపి స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు.

సిఐటియు జిల్లా మాజీ కార్యదర్శి తిరందాసు గోపి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మండల కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి “లేబర్ కోడ్లు – కార్మికులపై ప్రభావం” అంశంపై సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నూతన కార్మిక చట్టాలు తీసుకువచ్చిందని విమర్శించారు. ఇప్పటికే పెరిగిన ధరలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ విధానాలు వారి జీవన పరిస్థితులను మరింత కష్టతరం చేస్తున్నాయని తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్మిక ఉద్యమానికి తిరందాసు గోపి చేసిన సేవలు అపూర్వమని, ఆయన మరణం ఉద్యమానికి తీరని లోటని అన్నారు. ఆయన చూపిన మార్గంలోనే కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గొరిగే సోములు, జిల్లా ఉపాధ్యక్షుడు నకిరేకంటి రాము,జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వంగాల మారయ్య,గాదెకృష్ణ, ట్రాన్స్పోర్ట్ యూనియన్ జిల్లా నాయకులు పల్లె సత్యం, వేముల సైదులు,బజార్ హమాలి సంఘం నాయకులు మోటె అంజయ్య,రేగు జంగయ్య,మిర్యాల బిక్షం, నరసింహ, మిర్యాల శ్రీశైలం, మొగులయ్య,నాగటి అంజయ్య, స్వామి,గోరయ్య తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు అవసరం.జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News