సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కర్ల రాజేష్ లాకప్ మృతి ఘటనపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
లాకప్ మృతి ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వము స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్ యాదవ్, పట్టణ నాయకుడు పాంపాటి సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి