Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

క్రిస్మస్ వేడుకలకు అధిక నిధులు మంజూరు చేసిన సీఎం కు ధన్యవాదములు

10-12-2025 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకునే "క్రిస్మస్ పండుగకు" అధిక నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జిల్లా అధ్యక్షులు పాస్టర్ జాన్ జహంగీర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 7 వేల చర్చిలకు, 21 కోట్ల రూపాయల నిధులు కేటాయించి, క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకొనే విధంగా ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మరియు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ దీపక్ జాన్ లకు యాదాద్రి భువనగిరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సౌదర, సోదరీమణులు పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని జహంగీర్ తెలిపారు. తెలంగాణ లోని ఒక్కోక్క చర్చికి రంగులు వేయుటకు మరియు విద్యుత్ దీపాలంకరణకు 30వేల రూపాయల చొప్పున కేటాయించి, క్రిస్మస్ విందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల రూపాయల కోట్ల నిధులు మంజూరు చేసి, క్రిస్మస్ 2025 వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించారని ఆయన అన్నారు . ఈ అవకాశాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చర్చి లో బాధ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చర్చి కమిటీ లెటర్ ప్యాడ్ మీద, బ్యాంకు అకౌంట్ ను జతపరచి

ఈనెల 12 లోగా జిల్లా కలెక్టర్ కు లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు (1) *040*- *29801130*, *(2) 040*- *23391067* పోన్ నెంబర్లను

సంప్రదించాలని ఆయన కోరారు.

Sthanikam

క్రిస్మస్ వేడుకలకు అధిక నిధులు మంజూరు చేసిన సీఎం కు ధన్యవాదములు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News