Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 02:36 PM

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్

05-01-2026 268 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ
స్థానికం ప్రతినిధి కరీంనగర్
ము న్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణకరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, నకిరేకల్ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా గాజుల సుకన్య శ్రీనివాస్ మాట్లాడుతూ, సంస్థాగతంగా మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే ప్రధాన ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

మహిళల సమస్యలను ప్రజా సమస్యలుగా తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని, పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా శక్తిని సంఘటితం చేస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు.ఈ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మహిళా కాంగ్రెస్‌ను ఉద్యమాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు

Sthanikam

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News