Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:53 AM

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం – పట్టణ సీఐ వెంకటయ్య

04-01-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం

క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య అన్నారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని 19వ వార్డు అంబేద్కర్ నగర్ గ్రౌండ్‌లో థగ్స్ ఆఫ్ బిఎస్ఎన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యువకులతో కలిసి పట్టణ సీఐ వెంకటయ్య క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రెండు నెలల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కానుందని తెలిపారు. క్రీడలతో పాటు క్రమశిక్షణతో సాధన చేస్తే కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం సాధ్యమని అన్నారు.

క్రీడల వల్ల స్నేహ సంబంధాలు పెరుగుతాయని, ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలని సూచించారు.

ఈ టోర్నమెంట్‌కు 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొరిగాల ఉపేందర్ గౌడ్ ఆర్థిక సహకారంతో

మొదటి బహుమతి – ₹20,000, రెండవ బహుమతి – ₹15,000, మూడవ బహుమతి – ₹10,00 నగదు బహుమతులను ప్రకటించారు.

ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనుండగా, చివరి రోజున బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాడుగుల నవీన్, అంగిడి ఉపేందర్, ఎర్ర మాధవరెడ్డి, పుల్లయ్య, థగ్స్ ఆఫ్ బిఎస్ఎన్ యూత్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ, నవీన్, శాంతి వర్ధన్, ఖదీర్, భార్గవ్, మనీ, రాహుల్, రాజు, రాజేష్, దీక్షిత్, భారత్, నితిన్, అరుణ్, శరత్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం – పట్టణ సీఐ వెంకటయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News