Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణాలు.. ప్రత్యేక పూజల్లో చిరుమర్తి

27-03-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణాలు

శ్రీరామనవమి సందేశం ధర్మం–న్యాయం–ప్రజాహితం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్: శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లోని పలు రామాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ వేడుకలు కన్నుల పండుగలా జరిగాయని, భక్తి వాతావరణంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీ రామనవమి పర్వదినం ధర్మం, న్యాయం, ప్రజాహితం వంటి విలువలను గుర్తుచేసే పవిత్రమైన రోజని తెలిపారు.

శ్రీ రాముడు తన పాలనలో ప్రజల సంక్షేమం, సమానత్వం, న్యాయానికి అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి రామరాజ్యాన్ని స్థాపించారని ఆయన చెప్పారు. అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాలన కొనసాగిందన్నారు.

రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, దళిత బంధు, బీసీ బంధు వంటి పథకాలు సమాజంలోని అన్ని వర్గాలకు అండగా నిలిచాయని వివరించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డాయని తెలిపారు.

శ్రీ రాముడి పాలనలో ఉన్న నీతి, న్యాయం, పారదర్శకత, ప్రజల పట్ల నిబద్ధత వంటి విలువలు తెలంగాణ అభివృద్ధిలో ప్రతిబింబించాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలందరూ శ్రీరాముడి ఆశీస్సులతో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలని చిరుమర్తి లింగయ్య ఆకాంక్షించారు.

Sthanikam

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణాలు.. ప్రత్యేక పూజల్లో చిరుమర్తి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News