Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

కన్నపేగు ను గుళ్ళో వదిలించుకున్న కర్కశ కన్నతల్లి

కన్నపేగు ను గుళ్ళో వదిలించుకున్న కర్కశ కన్నతల్లి

కన్నపేగు ను గుళ్ళో వదిలించుకున్న కర్కశ కన్నతల్లి
January 06, 2026 06:11 PM 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

శిశువును అక్కున చేర్చుకుని, పెంచుకుంటా అంటూ మరో తల్లి ఆక్రందన.

పసి పిల్లలపై పైశాచికత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి.

కొడారి వెంకటేష్,బాలల హక్కుల పరిరక్షణ వేదిక.

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

తొమ్మిది మాసాలు మోసి కన్న శిశువును పుట్టిన కొన్ని గంటల్లోనే గుళ్ళో వదిలేసి పేగు బంధాన్ని వదిలించుకున్న ఓ కసాయి కన్నతల్లి ...ఒకవైపు, నవజాత శిశువును అక్కున చేర్చుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య చికిత్స చేయించి బిడ్డను నాకు ఇవ్వండి పెంచుకుంటా అంటూ ఓతల్లి పడ్డ ఆక్రందన.. మరొకవైపు చూపరులను ఆలోచింపజేసి, కంట తడి పెట్టించిన సంఘటన మంగళవారం భువనగిరి లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలోని శ్రీ లింగ భశ్వేశ్వర ఆలయంలో మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో అప్పుడే పుట్టి అమ్మ ఆదరణకు నోచుకోని ఓ పసిపాపను ఆలయ పూజారి ఆలయ ప్రాంగణంలో కనుగొని,గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించారు. గ్రామస్తులతో పాటు సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామానికి చెందిన యాకరి సంగీత,పసికూనను అక్కున చేర్చుకుని అమ్మ లేని లోటును తీర్చింది. పాప పరిస్థితి బాగా లేకపోవడంతో,చలితో కుంచించుకు పోవడంతో తన భర్త పరమేష్,ఆశావర్కర్ బాలమణి సాయంతో పాపను బీబీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళింది.ఆసుపత్రి సిబ్బంది పాప బొడ్డు పేగు,మాయను తొలగించి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం భువనగిరి జిల్లా ఆసుపత్రి కి పంపించారు. జిల్లా ఆసుపత్రి లో డాక్టర్లు పాపకు చికిత్స చేసారు.జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి, బాలల సంరక్షణ కమిటీల ఆదేశానుసారం పసి పాపకు మెరుగైన వైద్యం అందించడానికి హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి కి పంపించారు.పిల్లలు లేని తనకు దేవుని గుళ్ళో పసి పాప దొరికిందని,ఆ పాపను పెంచుకుంటా,ఇప్పించండి అంటూ యాకరి సంగీత అధికారులను,డాక్టర్ల ను ప్రాధేయపడింది. చట్ట ప్రకారం దత్తత తీసుకోవాలని, తమ వంతు సాయం అందిస్తామని అధికారులు సంగీతకు అప్పగించారు.నవజాత శిశువులను వదిలి వేయడం, చనిపోయిన శిశువులను దహణం చేయకుండా పారేయడం లాంటి పైశాచిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.మంగళవారం భువనగిరి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసి పాపను, ప్రాణాలు కాపాడిన పడమటి సోమారం గ్రామానికి చెందిన యాకరి సంగీత పరమేష్ దంపతులను, ఆశావర్కర్ బాలమణి లను ఆయన అభినందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.భువనగిరి జిల్లా కేంద్రంలో ఆస్పత్రిలో "సర్కారు ఊయల" ను, అలాగే జిల్లా లోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో "సర్కారు ఊయల" ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News