Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:08 AM

కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం

05-05-2026 758 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కాలుజారి బావిలో పడి ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధి బోర్గి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సావిత్రిబాయి (30), ఆమె కుమార్తె నిఖిత (12), మరో బాలిక నందిని (13) బావి వద్ద బట్టలు ఉతికేందుకు వెళ్లగా నిఖిత, నందిని ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు సావిత్రిబాయి బావిలోకి దిగగా ఆమె కూడా ప్రమాదానికి గురై ముగ్గురూ మృతి చెందారు. మృతులు జీవనోపాధి కోసం చాలాకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తూ ఉండగా కుటుంబ కార్యక్రమం నిమిత్తం గ్రామానికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. మృతులలో నందిని, నిఖితలు మొగడం పల్లి సిర్గాపూర్ హాస్టల్‌లో 6వ తరగతి చదువుతున్నట్లు వారి తండ్రి జాదవ్ పర్సురామ్ తెలిపారు. సమాచారం అందుకున్న కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, ఎస్‌ఐ దుర్గారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బోర్గి గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News