Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 04:02 AM

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

21-01-2026 200 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట పట్టణంలోని కిరాణం మర్చెంట్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్‌లో కల్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన మొత్తం మూడువందల అరవై ఐదు మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కల్యాణ లక్ష్మి పథకం కింద రెండు కోట్ల ఎనభై మూడు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు, షాదీ ముబారక్ పథకం కింద యాభై రెండు లక్షల ఆరు వేల ముప్పై రెండు రూపాయలు మొత్తం మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

పేద మరియు మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, ఈ పథకాలు మహిళలకు గౌరవం, భరోసా కల్పిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేన రెడ్డి, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News