Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

కాల్వలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం ప్రశ్న

24-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

బస్వాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన కాల్వల పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో ప్రశ్నించారు. సోమవారం జరిగిన సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.

బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తయితే భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగుతుర్తి నియోజకవర్గాలకు నీటిసరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రూ.30 కోట్ల ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద విడుదలైన నిధులతో తుంగుతుర్తి, భువనగిరి ప్రాంతాల్లో కొంతమేరకు నీటిని అందించగలిగారని పేర్కొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల మండలాల పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముందని ఆయన చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ప్రయోజనం అందాలంటే కాల్వల నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా మూసీ ప్రాజెక్టు కాల్వపై ఒక చిన్న బ్యారేజీ నిర్మించాలని సూచించారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు మిగిలిన ప్యాకేజీకి సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు.

Sthanikam

కాల్వలను ఎప్పుడు పూర్తి చేస్తారు? అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం ప్రశ్న

Article Image

హైదరాబాద్,

బస్వాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించిన కాల్వల పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో ప్రశ్నించారు. సోమవారం జరిగిన సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.

బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తయితే భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగుతుర్తి నియోజకవర్గాలకు నీటిసరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. రూ.30 కోట్ల ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద విడుదలైన నిధులతో తుంగుతుర్తి, భువనగిరి ప్రాంతాల్లో కొంతమేరకు నీటిని అందించగలిగారని పేర్కొన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల మండలాల పరిధిలో దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముందని ఆయన చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో ప్రయోజనం అందాలంటే కాల్వల నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా మూసీ ప్రాజెక్టు కాల్వపై ఒక చిన్న బ్యారేజీ నిర్మించాలని సూచించారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు మిగిలిన ప్యాకేజీకి సంబంధించిన నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే వీరేశం కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News