Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:35 AM

కక్కిరేణిలో ఘనంగా వార్షికోత్సవం

కక్కిరేణిలో ఘనంగా వార్షికోత్సవం

కక్కిరేణిలో ఘనంగా వార్షికోత్సవం
25-03-2026 167 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలోమండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సరస్వతి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.ఉపేందర్ మాట్లాడుతూ గ్రామంలోని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, దాతలు, తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

ముఖ్య అతిథి ఎంఈఓ దొడ్డి స్వామి మాట్లాడుతూ ఒకే పాఠశాల నుంచి 10 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. పాఠశాల నిర్వహణలో తల్లిదండ్రులు, దాతల భాగస్వామ్యం ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు జానపద గీతాలు, శాస్త్రీయ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. లిఖిత, జస్విక, అక్షతల ప్రదర్శనలు విశేషంగా మెప్పించాయి.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లా మధురవేణి సురేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు ఉప సర్పంచ్ నడిగోటి పాండు ఏఏపిసి చైర్మన్ చిల్ల ప్రేమలత మురళీకృష్ణ , గ్రామ పెద్దలు పిట్టా రాంరెడ్డి కృష్ణారెడ్డి కృష్ణమాచార్యులు , సామజిక కార్యకర్త వేముల సైదులు ప్రధానోపాధ్యాయులు గణేషు కృష్ణ స్వర్ణలత గోపాల్ రెడ్డి ప్రశాంతి పాఠశాల తల్లిదండ్రులు గుండు సంధ్య ,సైదులు , అంకిరెడ్డి కావ్య వెంకట్ , చిల్ల భవాని మధు నడిగోటి సంతోష కమలాకర్ , గుండె పూరి మాధవి రాజు , తెడ్ల రాజు చిల్ల వినయ్ పాపని జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కక్కిరేణిలో ఘనంగా వార్షికోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News