Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:56 PM

కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిది : నిర్మలా జగ్గారెడ్డి

28-04-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన సేవాదళ్ పార్టీకి వెన్నెముకలాంటిదని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సమర్థ శిక్షణ శిబిరం”లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణ, సేవా దృక్పథంపై ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంస్థాగత బలోపేతం సాధ్యమవుతుందని అన్నారు. నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ ఎల్లప్పుడూ ముందుండాలని కోరారు. ఈ శిబిరంలో క్షేత్రస్థాయిలో నాయకత్వ లక్షణాల పెంపు, ప్రజలతో మమేకం కావడం, పార్టీ నిర్మాణ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు, పలువురు సీనియర్ నాయకులు మరియు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక లాంటిది : నిర్మలా జగ్గారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News