తిరుమలగిరి సాగర్ మండలం తేట్టెకుంట గ్రామపంచాయతీ సర్పంచ్ గోగు బాలయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోందని చెప్పారు.
తేట్టెకుంట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తామని సర్పంచ్ గోగు బాలయ్య పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి