Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:45 AM

కాంగ్రెస్ నాయకులారా , మల్లయ్య యాదవ్ పై అబద్ధాలు ప్రచారం చేస్తే నాలుకలు చీరేస్తాం

30-01-2026 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బి ఆర్ ఎస్ పార్టీ మునగాల మండలం అధికార ప్రతినిధి ఎల్పి రామయ్య.

కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి పై జనవరి 24న చలో కోదాడ కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ భారీ బహిరంగ సభ నిర్వహించి కర్ల రాజేష్ మృతి పై వాస్తవాలను బయటపెట్టి బహిరంగంగా విసిరిన సవాలుకు మునగాల మండల కేంద్రంలో జనవరి 28న బుధవారం నిర్వహించిన సభలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉత్తమ్ దంపతులు తమ పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన దళిత కార్యకర్తలని అడ్డంపెట్టుకొని కర్ల రాజేష్ మృతికి కోదాడ మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ కారణమని దుష్ప్రచారానికి దిగుతూ. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి ఎల్పీ రామయ్య అన్నారు,శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కోదాడ నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ ఐదు సంవత్సరాల పాలనలో లబ్ధిపొందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు,నాటి కోదాడ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గంలో మునగాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహకారం అందించామన్నారు, కోదాడకు చెందిన మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు వరప్రసాద్ రెడ్డి గుండె ఆపరేషన్ కాగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహకారం అందించామని,ముస్కు శ్రీనివాసరెడ్డికి కుటుంబానికికళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయల చెక్కు అందించామని, కోదాడ మండల బలహీన వర్గాలకు చెందిన కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అర్జున్ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించి ఆదుకున్నది కూడా మల్లన్న అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలు,జెండాలు అనే తారతమ్యం లేకుండా ఐదు సంవత్సరాల కాలంలో మల్లన్న నియోజకవర్గం లో ప్రతి కుటుంబానికి రైతుబంధు, కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ఇలా కేసీఆర్ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా లబ్ధి జరిగేలాగా విశేషంగా కృషి చేశారని, అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ నేడు ఉత్తమ్ దంపతులు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి బలహీన వర్గాల నాయకుల్ని కార్యకర్తలను ఉసిగొలిపి అర్థంపర్థం లేని నిందారోపణలు చేపిస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఆదేశాలతోనే చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి మరి కొంతమంది పోలీసులు మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పేరు చెప్పాలని చిత్రహింసలు పెట్టి రాజేష్ మరణానికి కారకులు అయ్యారని మీడియా సాక్షిగా బహిరంగ సభలో మందకృష్ణ మాదిగ విమర్శించారని, ఆయన చేసిన విమర్శలను సమాధానం చెప్పుకోలేని ఉత్తమ్ దంపతులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీడియా సమావేశాలు పెట్టి దుష్ప్రచారానికి తెరలేపారు అన్నారు,సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తొగరు రమేష్, మండల ఉపాధ్యక్షులు గోపిరెడ్డి నాగిరెడ్డి, మాజీ జెడ్పిటిసి కోలా ఉపేందర్, మునగాల పట్టణ అధ్యక్షులు ఉడుం కృష్ణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్ నాగబాబు గడ్డం లింగయ్య , కాపర్తి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ నాయకులారా , మల్లయ్య యాదవ్ పై అబద్ధాలు ప్రచారం చేస్తే నాలుకలు చీరేస్తాం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News