Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే విస్తృత ఎన్నికల ప్రచారం

07-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 4వ, 10వ వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి గడపను తట్టుతూ ప్రజలతో నేరుగా మమేకమై ప్రచారం కొనసాగించారు. బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, పరిష్కారాలపై భరోసా ఇచ్చారు.గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత జుక్కల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇప్పటికే పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి స్పష్టంగా వివరించారు.అధికార పార్టీలోని అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, వార్డులో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.అందుకే బిచ్కుంద మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Sthanikam

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే విస్తృత ఎన్నికల ప్రచారం

Article Image

బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 4వ, 10వ వార్డుల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి గడపను తట్టుతూ ప్రజలతో నేరుగా మమేకమై ప్రచారం కొనసాగించారు. బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, పరిష్కారాలపై భరోసా ఇచ్చారు.గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత జుక్కల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇప్పటికే పూర్తయిన పనులు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి స్పష్టంగా వివరించారు.అధికార పార్టీలోని అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, వార్డులో ఏ సమస్య ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.అందుకే బిచ్కుంద మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News