Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:08 PM

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే

29-05-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తూకం విధానం, ధాన్యం నాణ్యత పరీక్షలను పరిశీలించి అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తూకంలో ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కొనుగోలు కేంద్రాలపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మవద్దని కోరారు. రైతులు పండించిన పంటలో చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ప్రతి రైతుకు మద్దతు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధ రెడ్డి, శ్రీకాంత్ పీఏసీఎస్ చైర్మన్, మాణిక్ రావు పాటిల్, సచిన్ పాటిల్, నగల్ గిద్దా మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News