Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:03 AM

జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు

28-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 90 వేల ఎకరాలకు పైగా జొన్న పంట సాగు జరిగిందని, గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ రైతులు తమ పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పంట కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రమకు తగిన ధర దక్కేలా ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్, రైతు నాయకులు విఠల్, విష్ణు, రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి – గొల్లపల్లి జయరాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News