Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

జెఎన్ యులో విద్యార్థులపై దాడి హేయమైన చర్య

27-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-వీసీ తక్షణమే రాజీనామా చేయాలి

-ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థులు,అధ్యాపకులపై జరిగిన అమానుష దాడిని ఎస్‌ఎఫ్‌ఐ (ఎస్ఎఫ్ఐ) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.ఈ మేరకు భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద ఎస్‌ఎఫ్‌ఐ భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం సుందరయ్య భవనంలో జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అండతోనే క్యాంపస్‌లలో ఏబీవీపీ గూండాలు స్వైరవిహారం చేస్తున్నారని మండిపడ్డారు.ముసుగులు ధరించి విద్యార్థినుల హాస్టళ్లలోకి చొరబడి,ఇనుప రాడ్లతో దాడి చేయడం పిరికిపంద చర్య అని విమర్శించారు.ప్రశ్నించే గొంతుకలను హింసతో అణచివేయలేరని,విద్యార్థి లోకం ఈ దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.విద్యార్ధి నాయకుల బహిష్కరణ ఎత్తివేయాలి,విద్యార్థులు తమ విద్యార్ధి సంఘాన్ని ఎన్నికల తమ ప్రతినిధులను ఎన్నుకున్నారని వి.సి.ని వైఖరిని ప్రశ్నించినందుకు వారిని క్యాంపస్ నుండి బహిష్కరణ చేయడం దుర్మార్గపు చర్య తక్షణమే వారిపై బహిష్కరణ ఎత్తివేయాలి లేకపోతే దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాము.వీసీకి పదవిలో ఉండే అర్హత లేదు,క్యాంపస్‌లో గంటల తరబడి హింస జరుగుతున్నా, పోలీసులు చూస్తూ ఉండిపోయారని,యూనివర్సిటీ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ధ్వజమెత్తారు. విద్యార్థులకు కనీస రక్షణ కల్పించలేని వీసీకి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని,ఆయన వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ,లావుడియా రాజు ఉపాధ్యక్షులు వేముల నాగరాజు,ఈర్ల రాహుల్,తిగుల్ల శ్రీనివాస్,ధరావత్ జగన్ నాయక్,సహాయ కార్యదర్శులు ఇందు రాణి,పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జెఎన్ యులో విద్యార్థులపై దాడి హేయమైన చర్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News