Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:53 AM

జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…

జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…

జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…
12-03-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్ నగర పాలనలో కొత్త మార్పులు

హైదరాబాద్ నగర పాలనలో పెద్ద మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనతో పాటు కొత్త పట్టణ పాలన చట్టాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే నగర పాలనలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. భవన నిర్మాణాల అనుమతులు, రహదారుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి ప్రధాన వ్యవహారాలు కేంద్రీకృత విధానంలో నిర్వహించబడతాయని తెలుస్తోంది.ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ల అధికారాలను కొంత మేరకు పరిమితం చేసి, పాలనను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధీనంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.హైదరాబాద్ నగరం విస్తరణ దృష్ట్యా పరిపాలనను సులభతరం చేయడం, సేవలను వేగవంతంగా అందించడమే ఈ నిర్ణయానికి కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాలు, ప్రజాప్రతినిధుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.కొత్త చట్టం రూపకల్పనపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Sthanikam

జీహెచ్ఎంసీ చట్టానికి మంగళం…

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News