Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

జవహర్‌నగర్‌లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు

22-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

మేడ్చల్: జవహర్‌నగర్ జీహెచ్ఎంసి పరిధిలోని పలు ఈద్ఘాల్లో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. కాప్రా మండలం జవహర్‌నగర్, వికలాంగుల కాలనీ నయా ఈద్ఘా, వెంకటేశ్వర కాలనీ పాత ఈద్ఘా, అంబేద్కర్ నగర్, మల్కారం, ఫరానగర్, అరుంధతీ నగర్, వైఎస్ఆర్ డంపింగ్ యార్డ్ ఈద్ఘాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఖురాన్ బోధనలను అనుసరించే వారు శాంతియుత జీవితం గడుపుతారని, ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగి శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు.

జవహర్‌నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ పాషామియా, కార్యదర్శి టి. కాలేషా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మల్లెపూల శ్రీకాంత్, కారింగుల జ్యోతి శంకర్ గౌడ్, యువజన నాయకులు వినయ్ కుమార్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రార్థనలు సజావుగా జరిగేలా సీఐ సైదులు, ఎస్సై రామ్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రత కల్పించారు.

Sthanikam

జవహర్‌నగర్‌లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News