Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:33 PM

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
24-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ముసునూరు మండలం చింతలవల్లిలో ఉపాధి కూలీల ధర్నా

ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లిలో ఉపాధి కూలీలు ఆందోళన బాట పట్టారు. (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ)ను యథావిధిగా కొనసాగించాలని, వీబి గ్రామజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వేముల బక్కయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం గ్రామీణ కూలీలకు జీవనాధారమని పేర్కొన్నారు. పథకం కొనసాగింపుపై నెలకొన్న అనిశ్చితి కూలీలలో అయోమయం సృష్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం పని కోరిన 15 రోజుల్లో ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

అదేవిధంగా ఈ చట్టం ద్వారా మౌలిక వసతుల అభివృద్ధి, కార్మికులకు బీమా సౌకర్యం వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయని తెలిపారు. సంవత్సరానికి 200 పని దినాలు కల్పించడంతో పాటు రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రయోజనాలు ప్రత్యామ్నాయ పథకాల ద్వారా అందుబాటులోకి రావని, అందుకే చట్టాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

మార్చి 2వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధి కూలీలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పల్లెపాము భవాని, మేడూరు సర్వీసు, ఎఫ్‌సి, బేబీ శాలిని, రాణి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News