Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:21 AM

జాతీయ సైన్స్ దినోత్సవానికి చాట్రాయి నుంచి పి. తిరుపతయ్య, బి. చంద్రకళ ఉపాధ్యాయ దంపతుల ఔదార్యం

27-02-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి మండలం నుంచి జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు రూ.10,000 విరాళం అందించిన ఉపాధ్యాయ దంపతులు పి. తిరుపతయ్య, బి. చంద్ర కళావతి అభినందనలకు పాత్రులయ్యారు. విద్యా అభివృద్ధి, శాస్త్ర విజ్ఞాన ప్రోత్సాహానికి తమ వంతు సహకారం అందించడం ప్రశంసనీయమని విద్యావేత్తలు పేర్కొన్నారు.

డెమొక్రటిక్ పిఆర్‌టియు మరియు జాతీయ ఉపాధ్యాయ సేవాదళ్ ఆధ్వర్యంలో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫిబ్రవరి 28న నిర్వహించనున్న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఈ విరాళం అందించారు.

చాట్రాయి మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా సేవలందిస్తున్న పి. తిరుపతయ్య, బి. చంద్ర కళావతి దంపతులు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని సహచరులు తెలిపారు.

డెమొక్రటిక్ పిఆర్‌టియు ఏపీ పక్షాన డి. శ్రీను, పీవీఆర్‌లు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సహకారం ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

Sthanikam

జాతీయ సైన్స్ దినోత్సవానికి చాట్రాయి నుంచి పి. తిరుపతయ్య, బి. చంద్రకళ ఉపాధ్యాయ దంపతుల ఔదార్యం

Article Image

చాట్రాయి మండలం నుంచి జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు రూ.10,000 విరాళం అందించిన ఉపాధ్యాయ దంపతులు పి. తిరుపతయ్య, బి. చంద్ర కళావతి అభినందనలకు పాత్రులయ్యారు. విద్యా అభివృద్ధి, శాస్త్ర విజ్ఞాన ప్రోత్సాహానికి తమ వంతు సహకారం అందించడం ప్రశంసనీయమని విద్యావేత్తలు పేర్కొన్నారు.

డెమొక్రటిక్ పిఆర్‌టియు మరియు జాతీయ ఉపాధ్యాయ సేవాదళ్ ఆధ్వర్యంలో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫిబ్రవరి 28న నిర్వహించనున్న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల బహుమతి ప్రదాన కార్యక్రమానికి ఈ విరాళం అందించారు.

చాట్రాయి మండలానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్)గా సేవలందిస్తున్న పి. తిరుపతయ్య, బి. చంద్ర కళావతి దంపతులు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని సహచరులు తెలిపారు.

డెమొక్రటిక్ పిఆర్‌టియు ఏపీ పక్షాన డి. శ్రీను, పీవీఆర్‌లు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సహకారం ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News