Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

26-02-2026 568 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 65పై 7 హోటల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.

చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 50 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రహదారిని దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొన్న వాహనం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతన్ని గుర్తుతెలియని వ్యక్తిగా నమోదు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతుడు నలుపు రంగు స్వెటర్, బ్రౌన్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలిసిన వారు 8712670187, 8712670148 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

జాతీయ రహదారి 65పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News