Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:03 AM

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

25-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాజీనే రాజమార్గం : జిల్లా పోలీసు అధికారి నరసింహ

సూర్యాపేట: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోలీసు అధికారి నరసింహ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోలీసు అధికారులతో కార్యాలయం నుంచి దృశ్య సమావేశం నిర్వహించి సూచనలు అందించారు.

రాజీ పడదగిన కేసులను గుర్తించి, వాటిలో ఉన్న ఇరు వర్గాల వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలని సూచించారు.

లోక్ అదాలత్ ద్వారా ఇరువైపుల సమ్మతితో త్వరితగతిన సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. క్రిమినల్ రాజీ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ సమస్యలు, మద్యం సేవించి వాహనం నడపడం, వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్, బ్యాంకు వసూళ్లు, విద్యుత్ చౌర్యం వంటి వివిధ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని, న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.

Sthanikam

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News