Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

జాతీయ లోక్ అదాలత్ విజయానికి సమన్వయం కీలకం. వి. మాధవి లత

18-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు కోర్టులో న్యాయవాదులు, పోలీసులతో సమావేశం

యాదాద్రి భువనగిరి,

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయం అత్యంత ముఖ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సంస్థ కార్యదర్శి వి. మాధవి లత ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించి న్యాయవాదులు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఆలేరు జూనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ మార్చి 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు.

గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టి కక్షిదారులకు ముందుగానే నోటీసులు అందజేయాలని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రీ-సిట్టింగ్స్ నిర్వహిస్తున్నామని, వాటి ద్వారా కేసులను ముందస్తుగా పరిష్కరించుకునే అవకాశం ఉందని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వనమా రాజు, ఉపాధ్యక్షులు టి. హరికృష్ణ, కార్యదర్శి చాంద్ పాషా, ట్రెజరర్ రవికుమార్, న్యాయవాదులు జుకంటి రవీందర్, సీసా శ్రీనివాస్ గౌడ్, కె.వి. ప్రసాద్ తదితరులు, ఎపిపిఒ పద్మజ, ఆలేరు సి.ఐ. ఏలాద్రి, మోటకొండూరు ఎస్.ఐ. అశోక్, గుండాల ఎస్.ఐ. తేజం రెడ్డి, ఆత్మకూర్ సి.ఐ. హనుమమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ లోక్ అదాలత్ విజయానికి సమన్వయం కీలకం. వి. మాధవి లత

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News