Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

జాతీయ లోక్ అదాలత్ విజయానికి న్యాయవాదుల సహకారం అవసరం.

18-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో బార్ అసోసియేషన్‌తో న్యాయ సేవా సంస్థ సమావేశం

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని సంస్థ కార్యదర్శి వి. మాధవి లత సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు భువనగిరిలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో సివిల్ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. రాజీ పరిష్కారం వల్ల కక్షిదారులు త్వరితగతిన న్యాయం పొందడమే కాకుండా, పరస్పర విభేదాలు తగ్గి స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని తెలిపారు.

సంబంధిత కేసుల్లో న్యాయవాదులు కక్షిదారులకు సరైన మార్గదర్శనం ఇవ్వాలని, రాజీ ద్వారా సివిల్ వివాదాలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న క్రిమినల్ కేసులు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా రాజీ ద్వారా పరిష్కరించిన కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

మార్చి 28 వరకు ప్రతిరోజూ భువనగిరి కోర్టు ప్రాంగణంలో ప్రీ-సిట్టింగ్స్ నిర్వహించి కేసుల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. వెంకటయ్య గౌడ్, కార్యదర్శి బొల్లేపల్లి కుమార్, ట్రెజరర్ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ లోక్ అదాలత్ విజయానికి న్యాయవాదుల సహకారం అవసరం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News