Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:35 AM

జరిమానా కాదు.. ప్రాణ రక్షణే ముఖ్యం హెల్మెట్ లేని వాహనదారులకు వినూత్న పాఠం చెప్పిన చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ

25-02-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో పోలీసులు రహదారి భద్రతపై వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి జరిమానాలు విధించడం ఆనవాయితీ. అయితే ఈసారి పోలీసులు భిన్నంగా ఆలోచించారు.

కె. రామకృష్ణ పర్యవేక్షణలో, చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి, జరిమానా విధించకుండా వారికి అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ముందుగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.

హెల్మెట్ భారం కాదు.. ప్రాణ రక్ష

ఈ సందర్భంగా ఎస్ఐ డి. రామకృష్ణ మాట్లాడుతూ, “హెల్మెట్ అనేది భారం కాదు.. అది ప్రాణ రక్ష. ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న దెబ్బ కూడా ప్రాణాంతకం కావచ్చు. అలాంటి వేళ హెల్మెట్ మీకు శ్రీరామరక్ష వంటిది” అని పేర్కొన్నారు.

వాహనం నడిపే ప్రతి వ్యక్తి తన కుటుంబ బాధ్యతను గుర్తుంచుకోవాలని సూచించారు. “మీరు బయటకు వెళ్లినప్పుడు మీ క్షేమం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారు. ఏదైనా అపశ్రుతి జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. మీ కోసం కాకపోయినా, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించండి” అని హితవు పలికారు.

యువతలో పెరుగుతున్న ప్రమాదాలు

ప్రమాదాలకు గురవుతున్న వారిలో అత్యధిక శాతం యువతేనని పోలీసులు వెల్లడించారు. సరైన రక్షణ లేకపోవడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేగాన్ని నియంత్రించి, రక్షణ కవచమైన హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని కోరారు.

చాట్రాయి పోలీసుల ఈ వినూత్న చర్యకు స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. జరిమానా విధించడం కంటే అవగాహన కల్పించడం ద్వారా ప్రాణాలను కాపాడే దిశగా పోలీసులు చేసిన ఈ ప్రయత్నం ఆదర్శంగా నిలుస్తోంది.

Sthanikam

జరిమానా కాదు.. ప్రాణ రక్షణే ముఖ్యం హెల్మెట్ లేని వాహనదారులకు వినూత్న పాఠం చెప్పిన చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News