Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:02 PM

జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం

జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం

జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం
01-03-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో పరీక్షలు

జర్నలిస్టులు వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని వెన్నెల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నరేష్ మామిడి, వైద్యురాలు దివ్య, ఆసుపత్రి నిర్వాహకుడు బయ్య దయాకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఈ శిబిరంలో జర్నలిస్టులకు హృదయ స్పందన పరీక్ష, రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ సమాజంలో ప్రభుత్వాలు మారే శక్తి జర్నలిస్టులకు ఉందని, వారు నిరంతరం వార్తల కోసం శ్రమిస్తారని తెలిపారు. కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించేందుకు ఇటువంటి శిబిరాలు అవసరమన్నారు.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమానికి సహకరించిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. పత్రికా సంఘ జాతీయ మండలి సభ్యుడు మిక్కిలినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘాలకు అతీతంగా శిబిరం నిర్వహించడం శుభపరిణామమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ బంటు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిత్యం శ్రమించే జర్నలిస్టులకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో పలు జర్నలిస్టులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించిన వైద్యులను ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులకు వెన్నెల ఆసుపత్రిలో బాహ్య రోగుల రుసుము లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తామని వైద్యులు తెలిపారు.

Sthanikam

జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News