Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:49 AM

జనవరి 26న రైతు–కార్మిక సమస్యలపై మోటార్ సైకిల్ ర్యాలీ

24-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నల్ల చట్టాల రద్దుకు పిలుపు

పాలకుల ద్వంద విధానాలే సంక్షోభానికి కారణం

సూర్యాపేట జిల్లా స్థానిక ప్రతినిధి బిక్షం

రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ధర్మ బిక్షం భవనంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకులు వరికుప్పల వెంకన్నలు మాట్లాడారు. విత్తన చట్టం, విద్యుత్ బిల్లు, విబిజీ రామ్ జీ పథకం, నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ, కార్మిక రంగాల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని, వాటి పరిష్కారంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రైతుల అప్పులు, ఆత్మహత్యలు ఆగడం లేదని, దీనికి ప్రభుత్వాల ద్వంద విధానాలే కారణమన్నారు.

రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఎస్‌కేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి, నల్ల చట్టాలను దొడ్డి దారిన తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

రైతాంగం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న నిర్వహించే మోటార్ సైకిల్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఏఐకేఎఫ్ రాష్ట్ర నాయకుడు ఎస్‌కే నజీర్, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, కెవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనవరి 26న రైతు–కార్మిక సమస్యలపై మోటార్ సైకిల్ ర్యాలీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News