Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

26-02-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయిలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు ప్రత్యేక కార్యక్రమం

ప్రతి జనసైనికుడు సభ్యత్వం తీసుకోవాలి – మొండ్రు సురేష్ పిలుపు

చాట్రాయి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు సభ్యత్వ నమోదు కొనసాగనున్నట్లు మండల ప్రధాన కార్యదర్శి మొండ్రు సురేష్ వెల్లడించారు.

మండలంలోని ప్రతి జనసైనికుడు తప్పనిసరిగా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని, కొత్తగా చేరాలనుకునే వారు మరియు పాత సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ క్రియాశీలక సభ్యత్వ పథకం ద్వారా సభ్యులకు పలు భద్రతా ప్రయోజనాలు అందనున్నాయని తెలిపారు. ఇందులో రూ.5 లక్షల జీవిత భీమా, ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం, అలాగే రూ.50 వేల ప్రమాద భీమా సదుపాయం కల్పించబడుతుందని వివరించారు.

జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు వారి కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ భీమా సదుపాయాలు అమలు చేస్తున్నామని మొండ్రు సురేష్ తెలిపారు.

సభ్యత్వానికి అవసరమైన పత్రాలు:

ఆధార్ కార్డు

పాస్‌పోర్ట్ సైజు ఫోటో

నామినీ ఆధార్ కార్డు

రూ.400 నగదు

శాశ్వత ఫోన్ నంబర్

సభ్యత్వం పొందాలనుకునే వారు సెల్ నెం: 9951253124 ను సంప్రదించాలని మొండ్రు సురేష్ సూచించారు.

Sthanikam

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News