Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

జనసేన దిమ్మె ఏర్పాటుకు నాయకుల ప్రశంసలు – చిన్నంపేటలో పరిశీలన

15-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని చిన్నంపేట గ్రామంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు తేళ్ళూరి ప్రసాద్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న జనసేన పార్టీ జెండా దిమ్మెను ఈరోజు నూజివీడు నియోజకవర్గ నాయకులు మరియు ఉమ్మడి కృష్ణా జిల్లాల అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నియోజకవర్గ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్ మరియు జనసైనికులు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా నాయకులు మరీదు శివరామకృష్ణ, ముమ్మలనేని సునీల్ కుమార్ మాట్లాడుతూ తేళ్ళూరి ప్రసాద్ జనసేన పార్టీపై ఉన్న అభిమానం తో స్వంత ఖర్చులతో పార్టీ జెండా దిమ్మెను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. పార్టీ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు జనసేన పార్టీ నాయకులుగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మరీదు శివరామకృష్ణ హామీ ఇచ్చారు. త్వరితగతిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, చాట్రాయి మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, టీడీపీ నేత చిన్న పుల్లయ్య, నాగుల అశోక్, చింతా సాయి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనసేన దిమ్మె ఏర్పాటుకు నాయకుల ప్రశంసలు – చిన్నంపేటలో పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News